సాధారణం గా మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి పూర్తవుతుంది అనుకుంటున్నా సమయంలో పెళ్లి పీటలపై ఇక వివాహం ఆగిపోతూ ఉంటుంది. ఇలాంటి ఘటనలు అటు దాదాపు నిజజీవితం లో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఇలా పెళ్ళి ఆగిపోయే పరిస్థితి వచ్చినా కూడా పెద్దలు కలుగజేసుకుని ఏదో ఒకటి సర్ది చెప్పి ఇక వివాహాన్ని జరిపిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 కానీ ఇటీవల కాలంలో అటు సినిమాల తరహాలోనే అటు పెళ్లి పీటలపై పెళ్లి ఆగిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. పెళ్లి ఆగిపోవడం కాదు ఏకంగా వధూవరులు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు దారుణంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే వధూవరులు ఒక్కసారిగా ఇలా ప్రవర్తించడంతో ఏం జరిగిందో తెలియక అందరూ షాక్ అయ్యారు అని చెప్పాలి. చైనాలోని ఒక పెళ్లి వేడుకలో ఇదంతా జరిగింది.


 పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక అందరూ అందంగా ముస్తాబయ్యారు. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న వధూవరులు ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా స్టేజ్ మీదికి నడుచుకుంటూ వచ్చారు. ఇక మరికొన్ని నిమిషాల్లో పెళ్లి తంతు పూర్తవుతుంది అనుకుంటున్నా సమయంలో ఒక్కసారిగా వాతావరణం హీటెక్కింది. అప్పటిదాకా వధూవరులు ఇద్దరీ వీడియో స్క్రీన్ మీద ప్లే అవుతుండగా.. ఒక్కసారిగా పెళ్లికూతురు మరొకరితో సన్నిహితంగా ఉన్న వీడియో ప్లే అయింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇక పెళ్ళికొడుకు వెంటనే వధువుని స్టేజ్ పైనుంచి నిట్టబోయాడు.  చేతిలో బొకేని ఆమె వరుడు మీదికి విసిరింది. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. తర్వాత కలగజేసుకుని  వారికి గొడవను సర్దుమనిగేలా చేశారు. చివరికి పెళ్లి క్యాన్సిల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: