తాజాగా అందుతున్న నివేదిక ప్రకారం మరో పదేళ్లలో కోవిడ్ -19 వంటి భీకరమైన మహమ్మారి పంజా విసిరే అవకాశాలు ఉన్నాయని లండన్ లోని కొంతమంది హెల్త్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలియజేయడం జరిగింది. వచ్చే పదేళ్లలో కొత్త మహమ్మారి తలెత్తడానికి 27.5 శాతం ఉన్నట్లుగా నిర్ధారించడం జరిగింది ప్రస్తుతం ఉన్న వైరస్ వ్యాప్తి తో పాటు వాతావరణంలోని మార్పులు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించి వ్యాధులు ఆధారంగా వీటిని అంచనా వేస్తున్నట్లుగా ఆ అధికారులు తెలియజేయడం జరిగింది. తాజాగా అందుతున్న నివేదిక ప్రకారం మనసులో నుంచి మనుషులకు వ్యాపించే కొత్త వైరస్ యూకే లో ఒక్కరోజులోనే దాదాపుగా 15,000 మందిని అంతం చేయగలదని తెలియజేసింది.
ఏవియన్ ఫ్లూ తరహాలోనే.. ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకోవడం మంచిదంటూ తెలియజేస్తున్నది. ఆరోగ్య సంస్థ.. వంద రోజుల్లో వ్యాక్సిన్ అభివృద్ధి చేసుకోవడం ద్వారా కొత్త వైరస్ ముప్పు 27.5 శాతం నుంచి 8 శాతానికి తగ్గించవచ్చని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారులను ఎదుర్కొనే అవసరమైన వ్యాక్సిన్ తయారు చేసుకోవడం మంచిదంటూ లండన్లు హెల్త్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి కూడా చాలా మెరుగుపడాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అంటూ తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉంటూ కరోనా బారిన పడకుండా ఉండడం మంచిది..