ప్రముఖ వ్యాపారవేత అయిన ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు తన పనిలో బిజీగా ఉంటేనే మరోవైపు సోషల్ మీడియాలో తనకు నచ్చిన వీడియోలను తన అకౌంట్ ద్వారా పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆనంద్ మహేంద్ర నుంచి వచ్చే ఆసక్తికర పోస్టులను చూసేందుకు అటు నేటిజన్స్ కూడా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఫన్నీ వీడియోలను స్ఫూర్తిని కలిగించే అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేసి ఎప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు ఆనంద్ మహేంద్ర.



 ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి మరోసారి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక ఇది ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎంతోమంది సోషల్ మీడియాలో పాపులారిటీ కావడానికి తమదైన శైలిలో డాన్సులు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక బుడ్డోడు ఇలాగే డాన్స్ చేసి వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఈ వీడియో ఆనంద్ మహేంద్ర కంటపడింది. ఆయనకు తెగ నచ్చేసింది. ఇంకేముంది నచ్చిన  వాటిని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్టుగానే ఈ వీడియోని పోస్ట్ చేశారు.




 ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటే.. ఒక కుర్రాడు తెఫ్ట్ అలారం పై ఫిట్గా డాన్స్ చేస్తున్నాడు. ఇక అలారం ఎలా చేంజ్ అవుతుందో ఆ బాలుడి డాన్స్ కూడా అలాగే చేంజ్ అవుతూ ఉంది అని చెప్పాలి. ఇక ఈ వీడియో ఆనంద్ మహేంద్రకు తెగ నచ్చేసిందట. ఈ వీడియో చూసి చాలాసేపు నవ్వుకున్నాను. ఇప్పటికే నవ్వుకుంటూనే ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో చూశాను అంటూ ఆనంద్ మహేంద్ర ఈ వీడియోకి ఒక కామెంట్ కూడా రాసుకోవచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: