ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ఇలాంటి ప్రమాదాలలో కొంతమంది ఊహించని విధంగా ప్రమాదం బారిన పడుతూ ఉన్నారు. రెప్పపాటు కాలంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మరి కొంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి కూడా రెప్పపాటులో చిన్న గాయం లేకుండానే బయట పడుతున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాగే బయటపడ్డాడు. హైవేపై ఒక వ్యక్తి కారులో వెళ్తున్నాడు. అయితే ప్రయాణ సమయంలో రోడ్డును తన స్మార్ట్ఫోన్లో రికార్డు చేయడం ప్రారంభించాడు.
ఇక ఆ కారుకు ముందు వేగంగా దూసుకు వెళ్తున్న ఒక భారీ ట్రక్కు ఉంది. అయితే అతను ఇలా వీడియో చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక బైకర్ దూసుకు వచ్చాడు. ఆ ట్రక్ ని ఓవర్టేక్ చేయాలని ఎంతగానో ముందుకు వెళ్లాడు. ఇక అంతలోనే ఒక పెద్ద మలుపు వచ్చింది. అయితే చాలా బరువుతో వెళ్తున్న ఆ భారీ ట్రక్ కంట్రోల్ తప్పింది. దీంతో ఇక మలుపు దగ్గర కంటైనర్ కుడి వైపుకు పడింది. అయితే సరిగ్గా కంటైనర్ పడుతున్న సమయంలోనే బైక్ నడుపుతున్న వ్యక్తి ఇక ఆ కంటైనర్ పక్కనే ఉన్నాడు. ఒక్కక్షణం ఆలస్యమైనా కూడా ఆ కంటైనర్ అతని మీద పడిపోయి ప్రాణాలు పోయేవి. కానీ సడన్గా బ్రేక్ వేయడంతో రెప్పపాటు కాలంలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది చూసి అతను నిజంగా అదృష్టవంతుడే అని కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.