సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో బాగా వైరల్ అవుతూనే ఉంటుంది. ఈరోజుల్లో ప్రతీ ఒక్కరికీ కూడా స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి రావడం, మంచి కెమెరా క్లారిటీ ఉన్న ఫోన్‌లు ఉండడంతో సమజాంలో జరిగే ప్రతీ చిన్న అంశం కూడా చాలా ఈజీగా వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.కొంచెం భిన్నంగా ఇంకా ఆశ్చర్యరకంగా ఉంటే చాలు వెంటనే సోషల్‌ మీడియాలో ఆ వీడియోని పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు కాస్త క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేసి నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇలా నెట్టింట వైరల్‌ అయ్యే వీడియోల్లో ఎక్కువగా వన్యప్రాణాలకు సంబంధించిన వీడియోలు మొదటి స్థానంలో నిలుస్తాయి.ఎందుకంటే జనాలు ఎక్కువగా జంతువుల వీడియోలానే బాగా లైక్ చేస్తారు. అందువల్ల వాటికి సంబంధించి ఎప్పుడూ ఏదొక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతూనే ఉంటుంది.మరీ ముఖ్యంగా జంగిల్ సవారీ లాంటి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి వీడియోలను నెట్టింట పోస్ట్ చేసే వారి సంఖ్య కూడా చాలా విపరీతంగా పెరుగుతోంది.


ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటోంది. ఇక జంగిల్‌ సవారీలో భాగంగా ఓ వ్యక్తి అడవిలో రైడ్‌కు వెళ్లాడు. అయితే అదే సమయంలో ఓ చిరుత వారికి కనపడింది. అయితే అదే సమయంలో అక్కడే ఉడుము జాతికి చెందిన ఓ ప్రాణి కూడా ఉంది. ఇక అటుగా వెళ్తున్న ఆ ఉడుముపై అటాక్‌ చేయడానికి చిరుత ముందుకు వెళ్లింది.అయితే దీనిని ముందుగానే పసిగట్టిన ఆ ఉడుము చిరుతకు దిమ్మ దిరిగే షాక్‌ ని ఇచ్చింది. కనీసం వెనక్కి కూడా తిరగకుండానే తోకతో చిరుత చెంపని ఆ ఉడుము చెల్లుమనిపించింది. ఒక్కసారిగా కంగుతిన్న చిరుత దెబ్బకి సైలెంట్‌ అయ్యింది. దీనంతటినీ స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేసిన ఓ నెటిజెన్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త బాగా వైరల్‌ అవుతోంది. ఇక ఉడుము తోకతో దాడి చేసిన సమయంలో గ్రాఫిక్స్‌ మిక్స్‌ చేసి మరీ వీడియోను పోస్ట్‌ చేయగా ఆ వీడియోని చూసిన వారు పగలబడి నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: