తల్లి ప్రేమకు ఈ భూమ్మీద ఏది సాటి రాదు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే నవమాసాలు మోసి బరువు అనుకోకుండా పిల్లలకు జన్మనివ్వడమే కాదు.. ఇక పిల్లలను అనుక్షణం కాచుకుని ఉంటుంది తల్లి. ఇక పిల్లలకు ఏదైనా సమస్య వచ్చింది అంటే చాలు అపరకాలిలా మారిపోతూ ఆ సమస్యను తరిమికొడుతూ ఉంటుంది. అలాంటిది ఇక పిల్లల ప్రాణం పోతుంది అని తెలిస్తే ఆ తల్లి ఎలా ఊరుకుంటుంది. ఎంతకైనా తెగిస్తూ ఉంటుంది. అయితే కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పాలి.



 తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది అన్న విషయాన్ని నిదర్శనంగా ఇక్కడ ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. మృత్యువు ఎదురుగా ఉన్న భయపడని ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి మృత్యువు తోనే పోరాడింది. ఇంతకీ వైరల్ గా మారిపోయిన వీడియోలో ఏముందంటే.. గ్రామంలోని బీడు భూములో ఒక పులి గోవులను ఒక దూడను వెంబడిస్తుంది. అయితే గోవులు వేగంగా పరిగెత్తి పులి బారి నుంచి తప్పించుకున్నాయి. కానీ ఒక  దూడ మాత్రం పులి పంజాకు చిక్కింది. దీంతో కాసేపటికి ఆ లేగ దూడను పట్టుకుంది పులి. వెంటనే తల్లి ఆవు పులి వైపుకు దూసుకొచ్చింది. పులి రూపంలో మృత్యువు అక్కడ ఉంది అని తెలిసిన భయపడకుండా కొమ్ములతో కుమ్మేసేందుకు ప్రయత్నించింది.



 ఇక ఆ తల్లి ఆవు ధైర్యం ముందు పులి కూడా భయపడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆ లేగ దూడను వదిలేసి  పులి అడవిలోకి పారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి నేటిజన్స్ అందరూ కూడా ఫిదా అవుతున్నారు. తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదు అనేదానికి ఈ వీడియో ఒక ఉదాహరణ అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు నేటిజన్లు. ఇంకెందుకు ఆలస్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: