ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి చిన్న విషయాన్ని ఇంటర్నెట్లో షేర్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రపంచ నలమూలలో జరిగిన ఎన్నో విషయాలను కేవలం నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారు జనాలు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని వీడియోలు అయితే అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి తరహా వీడియోలు కొన్ని భయాన్ని పుట్టిస్తూ ఉంటే.. మరికొన్ని మాత్రం కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తూ ఉంటాయ్. ఇంకొన్నిసార్లు ఏకంగా జంతువులు మనుషుల్లాగానే ఎలా యాక్టింగ్ చేస్తారు అన్నదానికి నిదర్శనంగా కొన్ని వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.



 ఏకంగా ప్రాణాలను రక్షించుకోవడానికి.. వచ్చిన ప్రమాదం నుంచి బయటపడటానికి ఏకంగా జంతువుల సైతం మనుషుల్లాగానే యాక్టింగ్ చేస్తూ ఉంటాయి అన్నదానికి నిదర్శనంగా ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలోకి రాగా.. ఇప్పుడు ఒక బాతు కూడా ఇలాంటి యాక్టింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీంతో ఇక ఈ బాతు యాక్టింగ్ చూసిన తర్వాత ఆ పక్షికి ఆస్కార్ అవార్డు ఇవ్వడం కాదు అంతకుమించి ఏదైనా ఉంటే ఇవ్వాల్సిందే అంటూ ఎంతో మంది నేటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇంతకీ వైరల్ గా మారిపోయిన వీడియోలో ఏముందంటే..



 ఒక బాతు నడుచుకుంటూ వెళ్లడాన్ని చూసిన కుక్క దానిని ఆహారంగా మార్చుకోవాలని అనుకొని అక్కడికి వచ్చింది. ఇది గమనించిన బాతు ఒక్కసారిగా కింద పడిపోయింది. ఏకంగా ప్రాణాలు పోయాయి అన్నట్లుగానే యాక్టింగ్ చేసింది. కుక్క తనను ఎలాగో బతికుంటే చంపేస్తుంది అందుకే చనిపోయినట్టు యాక్టింగ్ చేద్దాం అనుకుందో ఏమో ఇలా కిందపడిపోయి చలనం లేకుండా ఉండిపోయింది. అయితే బాతు దగ్గరికి వచ్చిన కుక్క అది నిజమే అని నమ్మి.. అటు ఇటు చూస్తూ చివరికి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇక కుక్క అక్కడ నుంచి వెళ్లిందో లేదో బాతు మళ్ళీ లేచి అక్కడ నుంచి పరార్ అయింది. ఈ వీడియో చూసి బాత్ యాక్టింగ్ కి అందరూ ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: