ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగింది. ఇవాళ ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ వారు పలు రకాల హామీలను కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వారి యొక్క దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న సమస్యలను కూడా పరిష్కరించడంతోపాటు పిఆర్సి అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసింది. అయితే ఈసారి ఉద్యోగ నేతలతో సబ్ కమిటీ భేటీ చాలా సానుకూలంగానే ముగిసిందట.


ఇవాళ ఉద్యోగ సంఘాలతో జరిపిన భేటీలో ప్రభుత్వం తరఫున బొత్స సత్యనారాయణ ,సలహాదారు సజ్జల, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా CPS రద్దు, DA బకాయిలతో పాటు పలు అంశాలకు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స  సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులకు త్వరలోనే పిఆర్సిని నియమిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇప్పటివరకు 11 వ పిఆర్సి అమలు ఉండడంపై ఉద్యోగులు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 12 వ పిఆర్సి నియామకం త్వరలోనే చేపట్టబోతున్నట్లు తెలియజేయడం జరిగింది


అలాగే మే 1 నుంచి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను సంబంధించి వరుస జీవోలను కూడా విడుదల చేస్తామని బొత్స ప్రకటించడం జరిగింది. DA బకాయిలపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉండడంతో అందులో కొన్నిటిని అయిన విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగిన ఉద్యోగ సంఘాల భేటీతో ప్రభుత్వం తరఫున మంత్రి వారు ఇచ్చిన హామీ కు మే ఒకటవ తేదీ నుంచి జీవోలు వెలువడనున్నాయి.

మరొకవైపు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు తర్వాత మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఉద్యోగ సంఘాల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.. ప్రభుత్వానికి ఎవరిపైన విపక్షత ఉండదు. ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులే అంటూ తెలియజేయడం జరిగింది. ప్రభుత్వంలో టచ్ లో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలతో ఇవాళ భేటీ అయ్యామని..CPS పై ఇతర సంఘాల నేతలు చేస్తున్న ప్రకటనల పైన అసలు స్పందించమని తెలిపారు బొత్స.

మరింత సమాచారం తెలుసుకోండి: