
ఇక బంధుమిత్రులు మధ్య ఎంతో సందడి వాతావరణం లోనే పెళ్లి తంతు జరుగుతుంది. కానీ ఆ వరుడు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న డ్రెస్.. చివరికి అతని పరువు పోయేలా చేసింది అని మాత్రం ఊహించలేకపోయాడు. ఎందుకంటే అటు స్టేజ్ పై నిలబడి వధువరులు ఇద్దరు కూడా ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇంతలో ఒక ఊహించని ఘటన జరిగింది. వరుడు వేసుకున్న ప్యాంట్ ఊడిపోయింది. దీంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు అని చెప్పాలి. ఇలా చివరికి వరుడు తెచ్చుకున్న డ్రెస్ వధువు ముందు అతని పరువు తీసేసింది.
అయితే ఇలా వరుడి ప్యాంటు ఊడిపోయిన సమయంలో అతని ఎదురుగా నిలబడిన వధువు సైతం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఇలా పెళ్లికూతురు మెడలో దండ వేసినా సమయంలో పెళ్ళికొడుకు పైజామా జారిపోయింది. అతను మాత్రం అది గమనించలేదు. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పాటు పెళ్లికూతురు కూడా ఇది చూసి నవ్వుకోవడం మొదలుపెట్టింది. దీంతో ఆ తర్వాత ప్యాంటు ఊడిపోయింది అని గమనించిన వరుడు మళ్ళీ దానిని సరి చేసుకున్నాడు. ఇది చూసి ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రావద్దు భయ్యో అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.