సాధారణం గా కొన్ని కొన్ని రహదారులు దట్టమైన అడవుల గుండా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఈ రహదారుల గుండా ప్రయాణించేటప్పుడు కాస్త అప్రమత్తం గా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే అడవుల్లో ఉండే జంతువులు ఒకసారిగా రోడ్డు మీదికి దూసుకు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయం లో కొన్ని కొన్ని సార్లు రోడ్డు ప్రమాదాలు జరిగితే.. ఇక ఇలా క్రూర మృగాలు  రోడ్డుపైకి వస్తే చివరికి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది అని చెప్పాలి. అందుకే అడవి గుండ రహదారుల్లో ప్రయాణించే వారు ఎప్పుడూ అప్రమత్తం గానే ఉంటారు.


 అయితే ఇక ఇలాంటి దారుల గుండా వెళ్లే ప్రయాణికులకు కొన్ని కొన్ని సార్లు ఊహించని ఘటనలు ఎదురవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా ప్రాణాలు తీసే పులి సింహం లాంటి క్రూర మృగాలు  ఒక్కోసారి రోడ్డుపైకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక్కడ ప్రయాణికులకు ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఏకంగా ఒక పెద్ద పులి రోడ్డు మీద ప్రత్యక్షం కావడంతో వాహనదారులందరూ ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు అని చెప్పాలి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వన్ ఇక ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.


 దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఉత్తరప్రదేశ్ లోని కతర్నీ యాగాట్ వన్యప్రాణుల అభయారణ్యం గుండా వెళుతున్న జాతీయ రహదారి పక్కన ఫారెస్ట్ బెంగాల్ టైగర్ నీళ్లు తాగుతుంది. అయితే ఇక పులి దాహం తీర్చుకోవడాన్ని చూసిన వాహనదారులు ఎంతో దూరంగా తమ వాహనాలను ఆపారు. ఇక పులికి ఎలాంటి ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించలేదు. అంతేకాదు ఎక్కడ ఆ పులి తమపై దాడి చేస్తుందో అని కాస్తయినా సౌండ్ చేయకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. కాగా ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: