ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇక ప్రపంచ నలమూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా అది సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇక ఎక్కడో జరిగిన ఘటనలు కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. అయితే ఇలా వెలుగులోకి వస్తున్న ఘటనలు కొన్ని మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగయింది  అనే భావనను కలిగిస్తూ ఉంటాయి.


 సాటి మనుషులకు సహాయం చేస్తూ ఎంతో మానవత్వంతో మెలగాల్సిన మనుషులు.. ఇక ఇప్పుడు ఆ మానవత్వాన్ని మరిచిపోయి సాటి మనుషుల ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు కూడా కోకొళ్లలుగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అదే సమయంలో ఇంకా మనుషుల్లో కాస్తో కూస్తో మానవత్వం బ్రతికే ఉంది అని నిరూపించే ఘటనలు కూడా సోషల్ మీడియాలోకి వస్తూ వైరల్ గా మారిపోతూ ఉంటాయ్. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించి చెప్పాలి. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక అమ్మాయికి మహిళ సహాయం చేసిన తీరు అందరిని ఫిదా చేసేస్తూ ఉంది.



 కాగా ప్రస్తుతం ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత మాత్రం నిజంగా మనుషుల్లో మానవత్వం సజీవంగానే ఉంది అనే అభిప్రాయానికి వస్తారు ప్రతి ఒక్కరు. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. ఒక బాలిక కాలు విరిగిపోయి క్రషర్ సాయంతో  రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇలాంటి సమయంలోనే ఇక రెడ్ లైట్ కాస్త గ్రీన్ లైట్ గా మారిపోయింది. దీంతో వాహనాలు ముందుకు కదిలేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఆ బాలిక ఒక్కసారిగా భయపడిపోయింది. ఇది గమనించిన పక్కనే ఉన్న మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి ఇక ముందుకు కదులుతున్న వాహనాలను ఆపింది. ఆ తర్వాత ఆ బాలికను వీపుపై ఎక్కించుకొని రోడ్డు దాటించింది. ఆ మహిళ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: