రానున్న మూడు రోజుల్లో గంటకు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తూ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. దీంతో రైతుల పంటలు ఉత్పత్తులను కూడా జాగ్రత్తగా నిలువ చేసుకోవాలని వీటితోపాటు పురుగుమందు పిచికారి చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. నిన్నటి రోజున 10 మండలాలలో 4 M.M సగటు వర్షపాతం నమోదైనట్లుగా తెలియజేశారు. నార్పల లో32.6 M.M సింగనమల 18.4 M.M. ఇతర ప్రాంతాలలో కూడా వర్షపాతం బాగానే నమోదయినట్లుగా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గౌతమి సూచిస్తోంది.
ఈరోజు రేపు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ మేరకు గురువారం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ గౌతమి అధికారులకు టెలికాన్పిరేషన్ నిర్వహించడం జరిగింది. అంతే కాకుండా పాత ఇల్లులు కూడిపోవడం ప్రాణ నష్టం తదితర వాటిపైన తహసీల్దారులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా సురక్షితమైన తాగునీరు అందించే విధంగా పారిశుద్ధ్యం పైన దృష్టి పెట్టాలని తెలియజేసింది. పంట నష్ట వివరాలను కూడా ప్రతి ఒక్కరు పక్కాగా నమోదు చేసుకోవాలని ఎలాంటి ఒత్తిళ్లకు తగ్గకూడదని తెలియజేశారు. అలాగే పంటను ప్రతి ఒక్కరు కూడా భద్రపరుచుకోవాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం జరుగుతోంది.