దేశంలో ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగే రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. తెలంగాణలో ఉండే జిల్లాలలో ఎక్కువగా మద్యం అమ్మకాలు జరుగుతూ ఉండడంతో త్రైమాసికంగా దేశంలో అత్యధికంగా మద్యం అమ్మిన రాష్ట్రంగా నిలవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలోనే రంగారెడ్డి జిల్లాలో..8,436.14 కోట్ల రూపాయల మద్యం అమ్మినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ పరిధిలో రూ.3752.96 కోట్లు.. మిగతా వాటిలో కూడా భారీగానే మద్యం అమ్ముడుపోయినట్లు సమాచారం.


ఇదంతా ఇలా ఉంటే తాజాగా నిన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని బ్రాండ్ల మద్యం పైన ధరలను తగ్గిస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. తగ్గించిన ధరలు నిన్నటి రోజు నుంచి అమలులోకి రాబోతున్నట్లు తెలియజేసింది. ఎక్సేంజ్ అధికారులు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు.హాఫ్ బాటిల పైన 20 రూపాయలు క్వాటర్  పైన 10 రూపాయలు తగ్గించినట్లుగా  ఎక్స్చేంజ్ శాఖ ప్రకటించడం జరిగింది ఈ తగ్గింపు ధరలు కూడా నిన్నటి రోజు నుంచి వర్తిస్తాయని తెలియజేశారు.


అంతేకాకుండా మద్యం విక్రమ కేంద్రాలలో కచ్చితంగా కొత్త ధరల పట్టికలను ఉంచాలని ప్రభుత్వం కూడా ఉత్తర్వులను ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొత్త మద్యం పాలసీతో కొత్త సుంకాలను తగ్గించడమే.. లైసెన్స్ రెన్యువల్ విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకొని సులభంగా అయ్యేవిధంగా ఉండేలా చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం బార్ లైసెన్సును పునరుద్ధరణ చేసుకొని సమయంలో లైసెన్స్ ఫీజు తో పాటు ధ్రువీకరణ పత్రాలను కచ్చితంగా కూడా సమర్పిస్తూ ఉండాల్సిందే.. అయితే కొత్త మద్యం పాలసీ విధానంలో ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదంటూ కూడా స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ విధానం మాత్రం వచ్చేయడాది నుంచి అమలులోకి రాబోతున్నట్లు తెలియజేసింది. మద్యం ధరలు తగ్గడంతో మందుబాబులు తెగ సంబరపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: