వారం మొత్తం ఎంతో కష్టపడి పని చేసే ఉద్యోగులు వారాంతంలో సెలవులు వచ్చాయంటే చాలు ఏకంగా పండగ వచ్చిందేమో అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ రెండు రోజులపాటు హాయిగా రెస్ట్ తీసుకొని వారం రోజులపాటు పడిన కష్టానికి అలసట మొత్తం తీర్చుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత సెలవులు ముగిసి సోమవారం మళ్లీ ఆఫీసులకు వెళ్లాలి అంటే బద్ధకంతో ఇక బోరున ఏడవడం ఒక్కటే తక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్కరూ ఇద్దరూ కాదు దాదాపు ఉద్యోగులందరి మూడ్ కూడా ఇలాగే ఉంటుంది. అందుకే ఉద్యోగులందరూ కూడా మండేని అస్సలు ఇష్టపడరు అని చెప్పాలి.



 కొంతమంది అతి కష్టం మీద ఇష్టం లేకపోయినా సోమవారం ఉద్యోగానికి వెళ్తే.. మరి కొంతమంది మాత్రం ఏదో ఒక సాకు చెప్పి డుమ్మా కొట్టడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా రెండేళ్ల చిన్నారి ఉద్యోగానికి వెళ్ళను అంటూ తల్లి ఏడుస్తుంటే ఓదార్చిన తీరు అందరిని ఫిదా చేస్తుంది. సాధారణంగా రెండేళ్ల చిన్నారి మారం చేసి ఏడుస్తూ ఉంటే అటు తల్లిదండ్రులు ఓదార్చడం చూస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం మొత్తం రివర్స్ లో జరిగింది.  ఇక్కడ ఒక రెండేళ్ల చిన్నారి తల్లి నేను జాబ్ కి వెళ్ళను అంటూ ఏడుస్తుంటే ఎంతో చక్కగా ఓదార్చింది.



 ఈరోజు నేను ఆఫీసుకు వెళ్ళను అని తల్లి మారం చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ క్రమంలోని రెండేళ్ల చిన్నారి ఒడిలో తల్లి వాలిపోయింది. దీంతో తన బుజ్జి బుజ్జి చేతులతో తల్లి తల నిమరడం చేస్తుంది చిన్నారి. ఆఫీసుకు వెళ్లక  తప్పదని నచ్చ చెబుతూ తల్లిని మోటివేట్ చేస్తుంది.  ఈ వీడియోలో కనిపిస్తున్న  ఆ చిన్నారి ఎంతో క్యూట్గా తల్లిని మోటివేట్ చేస్తున్న వీడియో చూసి ఎంతో మంది ఫిదా అవుతున్నారు. యువి భారద్వాజ్ అనే యూసర్ ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోని షేర్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియో చూసిన తర్వాత సో క్యూట్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: