గడిచిన కొంతకాలంగా వర్షాలు సమయం సందర్భం లేకుండా పడుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కూడా విపరీతంగా పడుతూనే ఉన్నాయి. నిన్నటి రోజున రాత్రి నుంచి తెలంగాణలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.. వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా జలమయం కావడం చేత పలుచోట్ల వర్షపు నీరు రోడ్డుపైన నిలవడం జరిగింది. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు.. మరికొన్నిచోట్ల వర్షం కారణంగా చెట్లు నేలకు కూలిపోయాయి చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలకు నీరు చేరడంతో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురి కావడమే కాకుండా భయభ్రాంతులకు గురవుతున్నారు.



హైదరాబాదులో ముఖ్యంగా దిల్ షిక్ నగర్,కోటి ,లకిడీ కపూర్, అమీర్పేట్ వంటి ప్రాంతాలలో కూడా భారీగా వర్షం కురుస్తోంది దీంతో పలు ప్రాంతాలలో రోడ్డుపైన వర్షం నిలవడం జరిగింది.. పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా చాలా బీభత్సవం సృష్టిస్తోంది. గండిపేట, బండ్లగూడ, తదితర ప్రాంతాలలో వర్షం కారణంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినట్టు తెలుస్తోంది.. రానున్న మూడు గంటలలో హైదరాబాదులో రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మల్కాజీగిరి తదితర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నప్పుడు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలుపుతోంది.

గంటకు 40 నుంచీ 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలని వీచే అవకాశం ఉందని ఇలా మరో రెండు రోజులపాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలుపుతోంది. మిగతా ప్రాంతాలలో ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేస్తుంది. రేపటి రోజున నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, మహబూబ్నగర్,  గద్వాల్, నారాయణపేట తదితర జిల్లాలలో వర్షాలు కురుస్తాయని తెలుపుతోంది. 24వ తేదీన కూడా పలు ప్రాంతాలలో వర్షం పడితే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వీటితోపాటు నాలుగు రోజులపాటు మన జిల్లాలలో yellow అలర్ట్ కూడా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: