ఈ మధ్యకాలంలో ఎండలు వర్షాలు సీజన్ ని బట్టి రావడం లేదు.. ముఖ్యంగా ఎండల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. ఇక ఈ రోజున విశాఖపట్నంలో ఒక అరుదైన రికార్డును సైతం నమోదు చేసుకున్నట్టుగా వాతావరణ శాఖ తెలియజేస్తోంది .వైజాగ్లో వందేళ్లలో అత్యధికంగా ఉష్ణోగ్రత ఈరోజు నమోదైనట్టుగా తెలుస్తోంది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నగరంలోని ముఖ్యంగా ఎయిర్పోర్టులో 44.6 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రత ఈరోజు మధ్యాహ్నం నమోదు అయినట్టుగా తెలుస్తోంది. విజయవాడలో 43 డిగ్రీలు ఉండగా సముద్ర తీర ప్రాంతం పక్కనే ఉంటూ అంత ఉష్ణోగ్రత అంటే అది దాదాపుగా 55 డిగ్రీల లాగా ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఇందుకు కారణం రుతుపవనాలు ఆలస్యం వల్లే ఇది జరిగిందని తెలియజేస్తున్నారు.దీనికి తోడు పసిఫిక్ లో ఎల్- నినో ప్రభావం వలన ఈ వేడి అత్యధికంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలియజేయడం జరిగింది.. గత పది ఏళ్లలో గమనిస్తే విశాఖపట్నంలో ఉష్ణోగ్రత 7 డిగ్రీల వరకు పెరిగిందని తెలియజేస్తున్నారు.
2011లో గరిష్టంగా 37 డిగ్రీలు.. 2012లో 37.4 2013లో గరిష్టంగా 37 డిగ్రీలు 2014లో మొదటిసారి విశాఖపట్నంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత.. 2015లో 35.8 డిగ్రీల ఉష్ణోగ్రత 2016లో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రత.. 2017లో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రత.. 2018లో 39 డిగ్రీలు 2019లో 38 డిగ్రీలు.. 2020లో 35.2 డిగ్రీలు 2021లో 35.3 డిగ్రీలు నమోదు కాగా తాజాగా గడిచిన వందేళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతను విశాఖలో ఈరోజు నమోదైనట్టుగా తెలియజేశారు. ఈ రోజున పగటిపూట 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది .
తిరుపతిలో 42.2, విజయవాడలో 43, నెల్లూరులో 41.6 , కాకినాడలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నది ఏపీ తీర ప్రాంత ప్రజలు ఎండల కంటే ఉక్కపోత వడగాలులతో చాలా సతమతమవుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే 11 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత విశాఖ ప్రాంతంలో నమోదవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ వెదర్ అధికారులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: