ఈ నెలలో ఎండలు తీవ్రత చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో పరిస్థితులు చాలా తీవ్రంగా మారిపోయాయి. గత మూడు రోజుల్లో ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లాలో ఏకంగా 54 మంది హిట్ వేవ్ కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. మరో 400 మంది ఆసుపత్రి పాలైనట్లుగా ఒక జాతీయ వార్తా సంస్థ తెలియజేయడం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతిరోజు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు వస్తూ ఉండడంతో ఆసుపత్రిలోని రోగుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉందని అక్కడ వైద్యులు సైతం తెలియజేస్తున్నారు



అయితే వీరీ మరణాలకు ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ హిట్ వేవ్ ఒకటి అన్నట్లుగా తెలియజేశారు. జూన్ 15న 23 మంది మరణించగా జూన్ 16న 20 మంది.. జూన్ 17న 11 మంది ప్రాణాలు విడిచినట్టుగా వైద్యులు తెలియజేస్తున్నారు.మృతి చెందిన వారిలో ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎండ తీవ్రతను తట్టుకోలేక మరణించారు అనే విషయంపై ఇంకా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్లో పాటు బీహార్ లో కూడా ఈ ఎండ తీవ్రత చాలా ఆందోళనకరంగా ఉన్నది. గడిచిన 24 గంటలలో బీహార్లో ఒక్కటే 44 మంది మరణించారని మరో మీడియా సంస్థ వెల్లడించింది.


ఈ ఎండలు భారీగా ఉండ నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారని ఇప్పటికే స్కూలను ఈనెల 24 నుంచి ఓపెన్ చేయాలని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.. మరొకవైపు పశ్చిమ బెంగాల్ ,ఆంధ్ర ప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిస్సా ,తమిళనాడు, మధ్యప్రదేశ్ ,బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలలో అధికంగా ఎండ తీవ్రత ఉందని..IMD హెచ్చరిస్తోంది.. బీహార్ ప్రాంతానికి ముఖ్యంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది.ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని.. ఇళ్ల నుంచి బయటికి వెళ్లకూడదని విషయాన్ని తెలియజేస్తోంది. ఆంధ్రప్రదేశ్ , రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. వర్షాలు పడే వరకు ఎండలు ఇలానే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: