ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఏ చిన్న విషయం ఆసక్తికరంగా కనిపించిన దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. అయితే ఇలా ఇంటర్నెట్లో వెలుగులోకి వచ్చే ఎన్నో వీడియోలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయని చెప్పాలి. సోషల్ మీడియాలోకి వచ్చే ఎన్నో వీడియోల ద్వారా ప్రతి ఒక్కరు కూడా కొత్త విషయాలను నేర్చుకోగలుగుతున్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.



 ఇప్పుడు వరకు నీటితో నిండిన నదులను ఎన్నో చూసుంటారు. కానీ ఇక నది ఎలా ఏర్పడుతుంది అని ఎప్పుడైనా చూసారా. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా అటవీ అధికారులు ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అడవిలో నుంచి ఒక నీటిపాయ మైదాన ప్రాంతంలోకి వస్తుంది. అయితే ఇలా ఒక నీటిపాయ మైదానం లోకి వస్తూ ఉండడంతో అటవీశాఖ అధికారులు కూడా షాంకయ్యారు.  వెంటనే దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.


 అయితే ఆ నీటిపాయ ముందుకు సాగుతూ ఒక చిన్న కాలువలా మారుతుంది అని చెప్పాలి. ఇక ఆ దృశ్యాలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. నదులు ఇలా ఏర్పడతాయి నదికి తల్లి అడవి. ఇవాళ ఉదయం 6 గంటలకు మా టీం తో ఫుట్ పెట్రోలింగ్ అంటూ ప్రవీణ్ కాస్వన్ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు అని చెప్పాలి. అయితే ఇలా వంపుల్లోకి నీరు పారుతూ రావడం వల్ల నదులు ఏర్పడతాయని.. నదులు అడవుల నుంచే పుడతాయని.. కాబట్టి నదులకు అడవులే తల్లులు అంటూ ఆయన చెప్పుకొచ్చారు . అయితే ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: