ఇక ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి కూడా తమ పెళ్ళికి ఇలాగే ఎంజాయ్ చేయాలని జీవితాంతం గుర్తుండిపోయే విధంగా స్వీట్ మెమోరీs గా మార్చుకోవాలని ఆశ పడుతున్నారు అని చెప్పాలి. దీంతో ఇక ఇటీవల కాలంలో పెళ్లి మండపంలో డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ట్రెండునే ఫాలో అవుతున్నారు. కొంతమంది అయితే ఇలా పెళ్లిళ్లలో డాన్స్ చేసి సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఒక వధువుకి డాన్స్ కు సంబంధించిన వీడియో కూడా ఇలాగే వైరల్ గా మారిపోయింది.
ఒక పంజాబీ పాటకు వధువు అదిరిపోయే స్టెప్పులు వేసి బంధువులందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. పాటకు తగ్గట్లుగా వధువు వేసిన స్టెప్పులు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాత్రం అదిరిపోయాయి అని చెప్పాలి. ఇలా డాన్స్ తో తగ్గేదేలే అన్నట్లుగా వరుడి ముందు స్టెప్పులతో అదరగొట్టింది. అయితే బంధువుల్లో కొందరు ఆ నవవధువు డాన్స్ ని తమ సెల్ఫోన్లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక తక్కువ సమయంలోనే మిలియన్ల వ్యూస్ కూడా వచ్చాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్కేయ్యండి.