పోలండ్‌కు చెందిన ఎవా స్టారోన్స్కా, పావెల్ బుర్కోస్కి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అందరిలా కాకుండా జీవితాంతం వీరి పెళ్లి గుర్తుండిపోవాలి అనుకున్నారు. అందుకే అండర్ వాటర్ లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ నీటి అడుగున జరిగిన పెళ్ళికి 300 అతిధులు హాజరయ్యారు. ఈ పెళ్లి గ్రాండ్ గా, విజయవంతంగా జరగడానికి 300 మంది డ్రైవర్లు సహాయం చేసారంట. ఈ ప్రేమ పెళ్లి అతిపెద్ద జలాశయం నీటి అడుగున జరిగింది. ఈ వివాహం 18 నిమిషాల పాటు జరిగింది. వివాహం చేసుకున్న జంట, పూజారి వాటర్ ప్రూఫ్ టెక్స్ట్‌లు సంకేత భాష వ్యవస్థను ఉపయోగించి నీటి అడుగున పరస్పరం సంభాషించుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. వావ్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎన్నో పెళ్లిళ్లు చూసాం కానీ ఇలా నీటి అడుగున పెళ్లి చూడడం ఇదే మొదటిసారి అని కామెంట్లు పెడుతున్నారు. నీటిలో కూడా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అదిరిపోయేలా రెడీ అయ్యారని మాట్లాడుకుంటున్నారు.