అయితే క్యూట్ వీడియోలు మాత్రమే కాదు అటు బయానక వీడియోలు కూడా అప్పుడప్పుడు తెర మీదికి వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇటీవల కాలంలో వీధి కుక్కలు రెచ్చిపోతూ ఏకంగా మనుషులపై దారుణంగా దాడి చేస్తున్నాయ్. ఏకంగా చిన్నారుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలాంటి తరహా ఘటనలు అటు ప్రతి ఒక్కరిలో కుక్కలు అంటే చాలు భయం పడే పరిస్థితిని తీసుకు వస్తున్నాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎక్కడైనా కుక్క కనిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా భయంతో ఊగిపోతూ ఉన్నారు.
ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈకోవలోకి చెందిందే. ఇద్దరు యువకులు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రెండు చిన్న కుక్కపిల్లలు వారి మీద దాడి చేయడానికి వెళ్ళాయి. అయితే అందులో ఒక యువకుడు చిన్న కుక్క పిల్లలే కదా అని బెదరగొట్టాడు. దీంతో ఆ చిన్న కుక్కపిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఇలా వెళ్లిపోయిన చిన్న కుక్క పిల్లలు భారీ శునకాన్ని అక్కడికి పిలుచుకొని వచ్చాయి. ఈ క్రమంలోనే భారీ శునకం ఎంట్రీ తో భయపడిపోయిన ఇద్దరి యువకులు చివరికి అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.