దుబాయ్‌లోని షేక్‌లందరూ కూడా ఎంత ధనవంతులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వారు ఎంత రిచ్ అయినా తమ సంప్రదాయంగా తెల్లని వస్త్రాలు మాత్రమే ధరిస్తారు.అయితే రీసెంట్ గా సోషల్ మీడియాని షేక్ చేసి వైరల్ అయిన ఓ వీడియోను కనుక పరిశీలిస్తే దుబాయ్‌లో తెల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి అక్కడ ఓ కార్ షోరూమ్‌కి వెళ్లి తన సిబ్బందితో కలిసి పెద్ద డబ్బు పెట్టెను పట్టుకెళ్లాడు.అతను అక్కడ కార్లు కొంటున్నట్లు వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిని లక్షల కొద్దీ నెటిజన్ల చూశారు.వీడియోలో ఓ కార్ షోరూమ్‌కి అతని వెనుక కొందరు పెద్ద డబ్బు పెట్టె పట్టుకుని వచ్చారు.సూపర్ మార్కెట్‌లో వస్తువులు కొంటున్నట్లుగా చాలా ఈజీగా ఖరీదైన కార్లన్నటినీ కొనుగోలు చేస్తున్నాడు.అలా ఈ కారు బుక్‌ చేయండి అంటూ, బాగా ఖరీదైన కార్లు ఏవి, స్పోర్ట్స్‌ కారు ఏవీ ఇక్కడ అంటూ అక్కడ సిబ్బందిని అడుగుతూ బాగా హడావిడి చేస్తున్నాడు.వారు కొన్ని ఖరీదైన కార్లను చూపిస్తే ఇంకా ఎక్కువ ధరలో కార్లు లేవా అని అతను ప్రశ్నిస్తున్నాడు.అలా కనిపించిన ప్రతి లగ్జరీ కారును చూసి ఈ కారు బుక్‌ చేయండి అంటూ తెగ ఆర్డర్‌ వేస్తున్నాడు. 


ఇంకా అంతే కాకుండా అందులో పనిచేస్తున్న సిబ్బందికి టీ, స్నాక్స్‌ తీసుకోండి అంటూ వారిపై డబ్బుల కట్టలుని విసిరేస్తున్నాడు. చివర్లో చిల్లర ఉంచుకోండి అని అంటున్నాడు. ఈ వీడియో చూసిన చాలా మంది కూడా దెబ్బకి షాకయ్యారు.ఇలా ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది.కానీ ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే ఇది నిజమైన వీడియో కాదని, ఫేక్ వీడియో అని తేలింది, దుబాయ్ షేక్‌ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే ఇలా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు సమాచారం తెలిసింది.అందువల్ల ఈ వీడియోలోని వ్యక్తిని దుబాయ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వీడియోలో అతడు దుబాయ్ సంప్రదాయ దుస్తులను ధరించి ఈ వెకిలి చర్యకు పాల్పడ్డాడని అక్కడి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.అతను చేసిన పని ఇస్లామిక్ సమూహానికి అవమానంగా పరిగణించబడుతుంది. దీంతో ఆ వీడియోపై ఫిర్యాదు అందింది. ఇంకా వీడియో తీసిన కార్ షోరూమ్ యజమానిని కూడా విచారణకు పిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: