జంతు ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి ఒక్క జంతువు జీవన శైలిలో ఎన్నో ప్రత్యేకమైన విషయాలు ఉంటాయి. అయితే ఇలాంటి తరహా అద్భుతాలే కొన్ని కొన్ని సార్లు కళ్ళ ముందు తారసపడుతూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయ్. అయితే ఒకప్పుడు కేవలం నేరుగా చూసిన వారికి మాత్రమే ఈ విషయం తెలిసేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథంలో చూసిన ప్రతిదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉండడంతో అందరికీ ఇక ఎక్కడో జరిగిన అద్భుతాలు కూడా కళ్ళ ముందు వాలిపోతూ ఉన్నాయి అని చెప్పాలి.



 ముఖ్యంగా అడవుల్లో జీవించే జంతువుల కదలికలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక ఇలాంటి తరహా వీడియోలు చాలానే ఇప్పటివరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ఇంస్టాగ్రామ్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది. సాధారణంగా పాము ముంగిసల మధ్య భీకరమైన పోరు జరగడం చూస్తూ ఉంటాం. ఇక ఇలాంటి వీడియోలు చాలానే సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఇలా పాము ముంగిసల పోరును చూడ్డానికి అందరూ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు



 కానీ ఇప్పుడు ఇందుకు భిన్నంగా పాము, కుందేలు మధ్య జరిగిన వార్ కూ సంబంధించిన ఒక వీడియో వెలుగు లోకి వచ్చింది. అయితే పాము విషపూరితమైనది కనుక పాపం కుందేలు పని అయిపోయినట్టే అని అనుకున్నారు అందరూ. కానీ ఈ పోరాటంలో పాముపై కుందేలే పైచేయి సాధించింది. వీరోచిత పోరాటం చేసి ఏకంగా పామును తరిమి కొట్టింది. అయితే ఈ వీడియో తీస్తున్న వారు సైతం రాబిట్ పాము చేతిలో ప్రాణాలు కోల్పోతుంది అని  అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో రాబిట్ ఎదురుదాడికి దిగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: