ఈ వీడియోలో జుట్టు విచిత్రంగా ఉన్న ఒక మహిళా ఒక జూలో ఒంటెను చూడటానికి తన బిడ్డను తీసుకొని వెళ్తుంది. దగ్గర నుంచి చూడాలి అనే అత్యుత్సాహంతో ఆ ఒంటెకు మరీ దగ్గరగా వెళ్తుంది ఆ మహిళా. ఆమె జుట్టు రింగు రంగులతో కొంచెం విచిత్రంగా ఉండటంతో తినే పదార్ధం అనుకుందో ఏమో ఆ ఒంటె. ఆ మహిళ జుట్టును తన నోటితో పట్టుకొని పరపర నమలడం మొదలుపెట్టింది. ఊహించలేని ఈ సంఘటనకు ఆ మహిళా ఒక్కసారిగా అవాక్కయిపోయింది. ఆమె ఎత్తుకున్న పిల్లవాడు కూడా భయపడిపోతాడు. ఆ ఒంటె నోటినుంచి తన జుట్టును విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది ఆ మహిళ. కానీ ఆ ఒంటె మాత్రం ఆమె జుట్టును విసిచిపెట్టదు. చివరకు ఎలాగో ఆమె ఆ ఒంటె నుంచి తప్పించుకొని దూరంగా పారిపోతుంది.
ఈ సంఘటన ప్రపంచంలో ఏ మూలన జరిగిందో కానీ...ఇప్పుడు ఈ సంఘటనకు సంబందించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో చూసి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "ఆమె జుట్టును ఫాస్ట్ ఫుడ్ అనుకుందేమో ఆ ఒంటె " అని కొందరు జోక్స్ వేస్తుంటే, "జంతువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి" అని మరి కొందరు జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో 12 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.