ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. కోస్టారికా దేశంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఆ దేశంలో ఫుట్బాల్ క్రీడాకారుడుగా కొనసాగుతున్న జీసస్ ఆల్బర్ట్ లోఫేస్ ఒక భారీ మోసలికి బలయ్యాడు. ఈ క్రమంలోనే అతని అవశేషాలను అధికారులు అతి కష్టం మీద వెలిక్కి తీసారు అని చెప్పాలి. అయితే ఈ క్రీడాకారుడుని చంపి తిన్న మొసలిని చంపడానికి ఇక అధికారులు చివరికి తుపాకులు వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంతకీ ఏం జరిగిందంటే కోస్టారికా రాజధాని షాన్ జోస్కో 140 మైళ్ళ దూరంలో శాంటా క్లాజ్ అనే పట్టణంలో ఈ ఘటన జరిగింది. మూసివేసి ఉన్న ఒక ఫిషింగ్ బ్రిడ్జిపై నుంచి కనాస్ నదిలో దూకాడు. అయితే ఒక పెద్ద మొసలి అతడిని నోట కరుచుకొని లాకెళ్లింది. స్థానికులు పెద్ద శబ్దాలు చేస్తున్న మొసలి మాత్రం భయపడలేదు. అయితే ఈ ఘటన చూపరులను ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసింది. అయితే వ్యాయామం చేస్తున్న సమయంలో ఆల్బర్ట్ నదిలో దూకాడు. అయితే ఆ నదిలో మొసళ్లు ఉన్నాయి తెలిసి కూడా కూడా అతను దూకడం వెనక కారణమేంటన్నది తెలియ రాలేదు. 29 ఏళ్ల ఆల్బర్ట్ ఆర్టిస్ డిపార్టీగో రియో అనే ఫుట్బాల్ క్లబ్ కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.