
మరి కొంతమంది గడప మీద కూర్చొని తుమ్మ కూడదు అని చెబుతూ ఉంటారు. దీంతో ఇలా ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు లేదా గడప మీద కూర్చున్నప్పుడు బయట వారి నుంచి తిట్లు ఎందుకు అని కొంతమంది తుమ్మును ఆపుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా తుమ్మును ఆపుకుంటే కంటి నరాలు దెబ్బతింటాయని రకరకాలుగా చెబుతూ ఉంటారు అని చెప్పాలి అయితే తుమ్మినప్పుడు కళ్ళు మూయకుండా ఉండగలమా అంటే అది అసాధ్యం అని చెబుతారు ఎవరైనా. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం కళ్ళు మూయకుండా తుమ్మితే ఎలా ఉంటుంది అని ఒకసారి ప్రయోగం చేసింది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఛాలెంజ్ లకు కొదవ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక యువతి కూడా అందరిలాగా కళ్ళు మూసి తుమ్మకుండా కళ్ళు మూయకుండానే తుమ్ముతాను అంటూ చాలెంజ్ చేసింది. ఈ క్రమంలోనే ముక్కులో ఒక పెన్ పెట్టుకొని తుమ్ము రావడం కోసం ప్రయత్నం చేసింది. ఇక తుమ్ము రాగానే కళ్ళు మూయకుండా తుమ్మగలిగింది. కనురెప్పలు కాస్త కదిలినట్లు వీడియోలో కనిపిస్తుంది. అంతకుమించి ఏమీ జరగలేదు. అయితే ఈ ఛాలెంజ్ పూర్తికాగానే ఆ యువతకి విపరీతంగా నవ్వొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన నేటిజన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాదు ఇది చుసిన వాళ్ళు కూడా ఇలా కళ్ళు తెరిచి తుమ్మడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పాలి.