
అడవికి రారాజు అయినా సింహం లాంటి జంతువులే నీళ్లలో ఉన్న మొసలిని చూసి భయపడుతూ ఉంటాయి అంటే దాని బలం ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో మొసళ్ళు ఏకంగా మనుషులను చంపి తిన్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. కాగా ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా మొసలి తోనే స్నేహం చేశాడు. అందరూ మొసలి దగ్గరికి వెళ్లడానికి భయపడితే.. అతను మాత్రం దగ్గరగా వెళ్లి దానికి చిన్న పిల్లలకి తినిపించినట్లుగా ఆహారం తినిపించడం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది.
గుజరాత్ రాష్ట్రంలోని గిరి సోమనాథ్ జిల్లాలో ఇరాన్ నది ఉంది. అయితే అక్కడ ఒడ్డున కోడియార్ ఆలయ సమీపంలో జీవా భగత్ అనే వ్యక్తి నీళ్లలో ఉన్న మొసలికి ఆహారం తినిపించాడు. ఇక ఆ తర్వాత మొసలి తలపై ఎంతో ప్రేమగా పలుమార్లు నిమిరాడు. ఇక్కడ మరో విచిత్రకరమైన విషయం ఏంటంటే నీళ్లలో ఎక్కడో దూరంగా ఉన్న మొసలి అతను పేరు పెట్టి పిలవగానే పరుగున ఓడ్డుకు వచ్చేసింది. ఇంతకీ మొసలి పేరు ఏంటో తెలుసా షీతల్. ఇక ఈ వీడియోలో మొసలి అతను ఎంతో దగ్గరగా ఉన్నాడు. అనుకుంటే మొసలి రెప్ప పాటు కాలంలో అతని దాడి చేసి ఆహారంగా మార్చుకోవచ్చు. కానీ ఆ మొసలి కూడా అతనిపై దాడి చేయకుండా సౌమ్యంగా ఉండిపోయింది.