అందులో నెమలి నిప్పులు కురిపిస్తూ కనిపించింది. షేర్ చేసిన కొద్ది సమయంలోనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో, నెమలి చల్లని ప్రదేశంలో నిలబడి నోరు తెరిచింది. దాని నోటి నుంచి ఆవిరి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది, ఇది సూర్యరశ్మికి వక్రీభవనం చెందుతుంది, అప్పుడు అది అగ్నిలా ఎరుపుగా కనిపిస్తుంది. ఇది నెమలి నిజానికి నిప్పును కక్కుతునట్లు భ్రమ కలిగించింది. ఈ ఆప్టికల్ ఎల్యూషన్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇది ఒక అద్భుతమైన దృశ్యం అని కామెంట్ చేస్తున్నారు.
నిపుణుల ప్రకారం, వాతావరణం కారణంగా చల్లగా ఉండే నెమలి ఊపిరితిత్తుల నుంచి ఆవిరి వస్తోంది. సూర్యకాంతి ఆవిరిని తాకినప్పుడు, అది వక్రీభవనం చెంది అగ్నిలాగా భ్రాంతిని సృష్టిస్తుంది. నెమలి నిప్పు కురిపిస్తున్నట్లు కనిపించిన వీడియో వైరల్‌గా మారడం ఇదే మొదటిసారి కాదు. 2019లో ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సందర్భంలో నెమలి నిజానికి నిప్పులు కక్కడం లేదని కూడా నిర్ధారణ అయింది.
నెమళ్లు నిప్పును బయటకు కక్కుతుందనే మాట ఆసక్తిని కలిగించినా, ఇది నిజం కాదు. చల్లటి వాతావరణం, సూర్యకాంతి, నెమలి శ్వాస వంటి అంశాల కలయికతో ఈ వీడియోలలో అగ్ని భ్రమ ఏర్పడింది. ఈ వీడియో భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తీయబడింది. ఆ సమయంలో ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయి కంటే తక్కువగా ఉంది. నెమలి కొన్ని నిమిషాల పాటు ఆవిరి వదలడం కనిపించింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. ఈ వీడియో కచ్చితంగా అద్భుతంగా ఉంది.