సాధారణంగా శిశువు పుట్టిన సమయంలో కేవలం కాళ్లు చేతులు ఆడించడం లాంటివి మాత్రమే చేస్తూ ఉంటాడు. అంతేకాని నడవడం కూర్చోవడం భూమ్మీద పాకడం లాంటివి అసాధ్యమనే చెప్పాలి. ఒకవేళ ఇలాంటివి కావాలి అంటే దాదాపు 6 నెలల తర్వాత నుంచి పాకడం కూర్చోవడం నడవడం లాంటివి క్రమక్రమంగా చిన్న పిల్లలు చేస్తూ ఉంటారు. కానీ పుట్టిన వెంటనే నడవడం గురించి ఎప్పుడైనా విన్నారా అంటే ఇక్కడ ఒక చిన్నారి మాత్రం పుట్టగానే నడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు.
సాధారణంగా అయితే పుట్టిన పిల్లలకు దాదాపు ఆరు నెలల తర్వాత మాత్రమే కాళ్ళ ఎముకలు బలపడతాయి. అప్పుడు మాత్రమే ఇక నడవగలుగుతారు. కానీ ఈ పిల్లవాడు మాత్రం పుట్టుకతోనే ఏకంగా తల్లి కడుపులో బలాన్ని పుంజుకొని వచ్చాడేమో అని అనిపిస్తుంది. ఏకంగా పుట్టగానే నడవడం మొదలుపెట్టాడు ఇది చూసి డాక్టర్లే కాదు అటు తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి. ఇక ఈ వీడియోలో ఒక నర్సు మంచం మీద పిల్లవాడిని పట్టుకుని కనిపించింది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే అతను నడుస్తూ బెడ్ దిగి వెళ్ళిపోతూ ఉండడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు.