దానికి బదులిస్తూ తాను డెలివరీలు చేయడానికి డుకాటి బైక్‌ను నడపడం ద్వారా నెలకు రూ. 45,000 సంపాదిస్తున్నట్లు సదరు డెలివరీ బాయ్ పేర్కొని ఆశ్చర్యపరిచాడు. రోజుకు 20 డెలివరీలు కంప్లీట్ చేస్తానని, ఒక్కో ఆర్డర్‌కు రూ.200 కంపెనీ తనకు చెల్లిస్తుందని వెల్లడించాడు. అలాగే ఒక్కో ఆర్డర్‌కు రూ.50 పెట్రోలు ఖర్చు అవుతుందని, రూ.150 చేతికొస్తాయని చెప్పాడు. మొత్తం మీద నెలకు 45 వేల రూపాయలు వస్తాయని వివరించాడు. అయితే నిజానికి అతడు 20*150 సంపాదిస్తే రోజుకి 3,000 డబ్బులు వస్తాయి. ఆ లెక్కన నెలకి 90,000 వరకు డబ్బులు సంపాదించొచ్చు. కానీ ఈ డెలివరీ బాయ్ తనకొచ్చేది రూ.45,000 మాత్రమేనని చెప్పి తాను లెక్కల్లో పూర్ అని నిరూపించుకున్నాడు.
అయితే ఒక్కో ఆర్డర్ పై 200 జోమాటో ఇవ్వదని 30 నుంచి 40 రూపాయలు మాత్రమే ఇస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఒక ఫన్నీ వీడియో నేమో అని మరికొందరు కొట్టి పారేస్తున్నారు. మరోవైపు అఫీషియల్ జొమాటో కంపెనీ ఈ వీడియోని లైక్ చేసింది. ఎందుకంటే ఈ డెలివరీ ఏజెంట్ వీడియో లక్షల వ్యూస్‌తో బాగా వైరల్ అయింది. వీడియో చివరిలో అతను ఉద్యోగం మానేసి ఫుల్‌టైమ్ డెలివరీ ఏజెంట్‌గా మారాలని యువతను ప్రోత్సహించాడు.
జొమాటో డెలివరీ ఏజెంట్ వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. ఆగస్టులో, బెంగుళూరులోని ఒక డెలివరీ ఏజెంట్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కస్టమర్ ఫుడ్ ఆర్డర్‌ను తింటూ కనిపించాడు. జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల పాపులారిటీ డెలివరీ ఏజెంట్ల సంఖ్య పెరగడానికి దారితీసింది. ఈ ఏజెంట్లు తరచుగా ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది. కష్టమైన ట్రాఫిక్ పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. అయినప్పటికీ, వారిలో కొందరు తమ ఉద్యోగాలను మరింత ఆనందదాయకంగా మార్చడానికి క్రియేటివ్ వేస్ వెతుక్కుంటున్నారు.