కేరళలో 2018లో మొదటిసారిగా నిఫా వైరస్ కి సంబంధించిన మొదటి కేసు నమోదు అయ్యిందట.ఆ తర్వాత మళ్లీ 2021లో ఈ వైరస్ కు సంబంధించిన కేసులు బయటపడ్డాయని కేరళ ఆరోగ్య శాఖ తెలియజేస్తోంది.మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ వైరస్ అక్కడక్కడ కనిపిస్తూ ఉండడంతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు.. నిఫా వైరస్ అంటే జంతువుల నుంచి ప్రజలకు సంక్రమించే జునోటిక్ వ్యాధిగా గుర్తించారు.. కలుషితమైన ఆహారం లేదా నేరుగా వ్యక్తి నుంచి వ్యక్తికి ఇది వ్యాపిస్తుందట. మొదటిసారిగా నిఫా మలేషియాలో వ్యాప్తి చెందినట్లు సమాచారం. అయితే ఇది ఎక్కువగా జబ్బు బారిన పడిన పందులు లేదా కలుషితమైన కణజాలాలతో ప్రత్యేక సంబంధం ఉన్న వాటి వల్ల ఇది వ్యాప్తి చెందుతుందట.
ఎక్కువగా బంగ్లాదేశ్ భారత్లో గబ్బిలాల మూత్రం లేదా లాలాజలంతో కలుషితమైన పనులు వాటి ఉత్పత్తుల నుంచి వచ్చే వైరస్ ఇది అన్నట్లుగా who తెలియజేస్తోంది.. అయితే ఈ నిఫా వైరస్ చూపిన వారు జ్వరం తలనొప్పి వాంతులు గొంతు నొప్పి వంటివి ఉంటాయట.. మైకం స్పృహ కోల్పోవడం తదితర లక్షణాలు కూడా ఉంటాయని తెలుపుతున్నారు. ఈ వైరస్ సోకిన నాలుగు రోజుల నుంచి 14 రోజులలో ఈ లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయట అయితే ఈ వైరస్ బారిన పడ్డవారు పూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు.