వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా శివారులోని వట్లూరి రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి తన భార్యపై దాడికి యత్నించాడు. ఈ నేపధ్యంలో ఆమెను పట్టాలపై నిల్చోబెట్టి చేతిలో బ్లేడ్ పట్టుకుని ఎటాక్ చేయబోయాడు. అది గమనించిన కానిస్టేబుల్ వాళ్ల దగ్గరకు చేరుకుని అతడిని వారించే ప్రయత్నం చేయగా కోపంతో ఊగిపోతున్న ఆమె భర్త కానిస్టేబుల్ అని చూడకుండా మీదకి పోయాడు. ఒకవైపు రైలు రావడం.. మరో వైపు భర్త చేతిలో బ్లేడు. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్.. భర్త చేతిలో నుంచి భార్యను కాపాడటమే కాకుండా ఇద్దరిని రైల్వే ట్రాక్ నుంచి పక్కకు తీసుకొచ్చాడు.
అలా తన ప్రణాలను సైతం పనంగా పెట్టి, ధైర్యం చేసి ఇద్దరు ప్రాణాలు కాపాడటంతో కానిస్టేబుల్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా ఆ భార్యాభర్తల మధ్య గొడవ ఏంటి? అతడు ఆమెను ఎందుకు చంపాలి అనుకున్నాడు? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ దృశ్యాలను చూసిన జనాలు సదరు పోలీస్ అధికారిని కామెంట్లతో ఆకాశానికేత్తెస్తున్నారు. కొందరు అతగాడిని రియల్ హీరో అంటే, మరికొంతమంది ఆ పోలీసుని వెండితెరపైన హీరోలు మీ ముందు దిగదుడిపే అంటూ కీర్తిస్తున్నారు. ఇంకెందుకాలస్యం, మీరు కూడా సదరు దృశ్యాలను చూసి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరి!