
ప్రస్తుతం ఉన్న పిల్లలకు జ్వరం జలుబు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వస్తే అవి తగ్గే వరకు చాలా సమయం పడుతున్నట్లు వైద్యులు ఒక అధ్యయనంలో తెలియజేసినట్లు తెలుస్తోంది.. ఒక సర్వే నిర్వహించిన సర్వేలో లోకల్ సర్కిల్ ద్వారా దేశవ్యాప్తంగా 317 మంచి జిల్లాలకు చెందిన 31 వేల తల్లితండ్రుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ వాస్తవం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లలు మళ్లీ చాలా అనారోగ్యానికి గురవుతున్నట్లుగా ఈ సర్వేలో తెలియజేయడం జరిగింది.
ప్రస్తుతం దేశంలో పలు రకరకాల వైరస్ లా సైతం వ్యాపిస్తున్నాయి.. అందుకు కారణం కూడా కోవిడ్ అని పిల్లలనుంచి తల్లితండ్రులు సర్వేలో తెలియజేశారట. ఈ సర్వేలో తల్లితండ్రులు తెలిపిన ప్రకారం తమ పిల్లలకు గత ఏడాదిలో 4 నుంచి 6సార్లు జ్వరం జలుబు దగ్గుతూ బాధపడుతున్నట్లు తెలియజేశారు. మరి కొంతమందికి ఏకంగా 12 సార్లు వచ్చినట్లుగా 3% శాతం మంది తల్లితండ్రులు తెలియజేశారు. మిగిలిన 38% మంది తల్లిదండ్రులు రెండు నుంచి మూడుసార్లు వస్తున్నట్లుగా తెలిపారట. వైద్యులు కూడా ఈ విషయాన్ని గుర్తించి జ్వరం దగ్గు జలుబు సంభవించడం కచ్చితంగా పెరుగుతుందని అదనంగా ఇప్పుడు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలుపుతున్నారు. కోవిడ్ వల్ల పిల్లల ల ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉన్నదని అందుకే ఇలా జరుగుతోందని తెలుపుతున్నారు.