బెల్లీ డ్యాన్స్ అనేది మెడిల్‌ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాలో ఉద్భవించిన ఒక నృత్య రూపం. మెడ నుంచి పొట్ట వరకు ఊపేస్తూ రిథమిక్ మ్యూజిక్ తో ఈ డాన్స్ చేస్తారు. బెల్లీ డ్యాన్స్ సాధారణంగా మహిళలే చేస్తుంటారు. ఇది కేవలం ఆడవారికే సాధ్యమవుతుందనే కూడా భావన చాలా మందిలో ఉంది.

అయితే, బెల్లీ డ్యాన్స్ మహిళలకు మాత్రమే కాదు.  పురుషులు కూడా నైపుణ్యంతో ఈ నృత్యాన్ని నేర్చుకోవచ్చని, బహిరంగంగా ప్రదర్శించవచ్చని ఒక యువకుడు చెప్పగానే చెప్పాడు. ఇటీవల ఓ పార్టీలో ఈ యువకుడు తన బెల్లీ డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతడి నాట్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గానూ మారింది.  అతను ఒక ప్రముఖ పాటకు నోరా ఫతేహి లాగా అద్భుతంగా డ్యాన్స్ చేసి వావ్ అనిపించాడు. ఒక యువతి లాగా డ్రెస్ చేసుకొని అతడు తన పొట్టను లేడీ ప్రొఫెషనల్ బెల్లీ డ్యాన్సర్ల కంటే గొప్పగా ఊపేస్తూ అదరగొట్టాడు.

ఈ యువకుడి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయిన అతిథులు పెద్ద ఎత్తున చప్పట్లు, హర్షధ్వానాలు చేశారు. ఆ యువకుడి బెల్లీ డ్యాన్స్‌ని కెనడియన్ డ్యాన్సర్, నటి నోరా ఫతేహితో పోల్చారు. ఈ నటి తన బెల్లీ డ్యాన్స్ స్కిల్స్‌కు పేరుగాంచింది. నోరా ఫతేహికి భారతదేశంలో, విదేశాలలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే నోరా ఫతేహీ కంటే ఆ యువకుడు బాగా డ్యాన్స్ చేశాడని, ఆమె అతడిని చూసి నేర్చుకోవాలని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.

 42 సెకన్ల వీడియోలో డ్యాన్స్ చేసిన యువకుడి వివరాలు తెలియరాలేదు. అతను ఓవర్ నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారాడు. అతని గురించి మరింత తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నారు.  బెల్లీ డ్యాన్స్‌కు సంబంధించిన మూస విధానాన్ని, నిబంధనలను బ్రేక్ చేసి, ఈ కళారూపం ద్వారా తనను తాను వ్యక్తీకరించినందుకు కొంతమంది అతనిని ప్రశంసించారు.

 బెల్లీ డ్యాన్స్ అనేది లింగం, వయస్సు లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరైనా చేయగల డ్యాన్స్. బెల్లీ డ్యాన్స్‌ అంటే అమ్మాయిలకే కాదు, డ్యాన్స్‌ని ఇష్టపడే వారందరికీ అని పార్టీలో డ్యాన్స్ చేసిన ఈ యువకుడు కూడా నిరూపించాడు. ఎక్స్ అకౌంట్ @desimojito షేర్ చేసిన ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: