ఇక ఏదో ఒక టెక్నిక్ ఉపయోగించి ఇలా ఎలాంటి మనుషులు లేకుండానే కుర్చీలు టేబుల్స్ ఇతర వస్తువులు కదిలినట్లుగా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఇది చూసి ప్రేక్షకులు తెగ భయపడిపోతూ ఉంటారు. అయితే నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు జరుగుతాయి అంటే అసాధ్యం అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం టెక్నాలజీతో ఇది సాధ్యమైంది. ఏకంగా అచ్చం దెయ్యం సినిమాలలో చూపించినట్లుగానే ఎవరి ప్రమేయం లేకుండానే కుర్చీలు వాటంత అవే కదులుతూ ఉన్నాయి. అయితే ఇలా కుర్చీలు కదలడానికి కేవలం చప్పట్లు కొట్టితే సరిపోతుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
అయితే ఇలా చప్పట్లు కొట్టగానే కుర్చీలు ఎటుపడితే అటు కదలడం కాదు ఏకంగా కావాల్సిన చోటుకు వెళ్లి అక్కడే ఆగిపోతాయి. చప్పట్లు కొడితే కుర్చీలు కదలడం ఏంటి.. ఇదేమైనా దెయ్యం సినిమానా.. కుర్చీలు వాటంతట అవే కదలడానికి అనే అనుమానం మీకు కలుగవచ్చు. కానీ ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా మీరు దీనిని నమ్మకుండా ఉండలేరు. చైనాలోని నిస్సాన్ మోటార్కో లిమిటెడ్ కంపెనీ ఇంటెలిజెంట్ పార్కింగ్ చైర్స్ ని 2016 లోనే తయారు చేసింది. అయితే నిస్సాన్ లోని ఆటోమోటివ్ ఇన్నోవేటర్లు ఈ సెల్ఫ్ పార్కింగ్ ఆఫీస్ కుర్చీలు తయారీపై మళ్లీ దృష్టి సారించారు. వైఫై కనెక్టివిటీ తో ఇక ఈ కుర్చీలు చప్పట్ల కొట్టగానే అవి ఉండే స్థానాల్లోకి వెళ్లి ఆగిపోతాయి.