2005 నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 50 మానవ సైన్ఫ్లూ కేసుల సైతం నమోదు అయినట్లుగా యూకే లో వైద్యుల సైతం గుర్తించారు.అయితే ఇది ఒక సరికొత్త కేస్ అని మునుపటి కేసులతో సంబంధం లేనిదని ఇ స్వైన్ ఫ్లూ అనేది యూకే లో పందుల ద్వారా వ్యాప్తి చెందుతున్న ఫ్లూ వైరస్ అంటున్నట్లుగా తెలియజేశారు. అందుతున్న సమాచారం ప్రకారం యూకే లో కనుగొనబడిన ఇన్ఫెక్షన్-1 B,1.1 అని ఒక ప్రత్యేకమైన క్లాడ్ లేదా రూపాన్ని ధరిస్తోందని ఇది ప్రపంచంలోని చాలా చోట్ల వెలుగు చూసిన కేసుల కంటే చాలా భిన్నంగా ఉందంటూ తెలియజేస్తున్నారు.
అయితే వైరస్ సోకిన వ్యక్తి ఎవరన్నది గుర్తించలేమని అతని తేలికపాటి అనారోగ్యంతో కోరుకుంటున్నాట్లుగా తెలియజేశారు. అప్పుడు ఆసుపత్రిలో కూడా చేరలేదని పైగా పందులు పెంపకం కూడా లేకుండానే.. పందులు కూడా దగ్గరగా ఉన్నట్లుగా ఎక్కడ కూడా ఆధారాలు లేవని తెలియజేశారు అయితే అతనికి ఈ ఇన్ఫెక్షన్ ఎలా సోకింది అనే విషయం పైన పరిశోదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి యూకే లో పలువురు పరిశోధకులు సైతం వీటిని పరిశోధిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇవి ఎంతవరకు వ్యాప్తి చెందుతాయి ఇక్కడ ఎన్ని కేసులు నమోదు అయ్యాయని కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం. రొటీన్ ఫ్లూ పై నిగా పెట్టడం వల్ల దీనిని గుర్తించవచ్చని తెలియజేస్తున్నారు.