2024 కి ఏడాదికి స్వాగతం పలుకు తున్న ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సెలవుల కోసం ఉద్యోగస్తులు విద్యార్థులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 లో సాధారణ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. వచ్చే ఏడాది రాబోతున్న పండుగలు ,జాతీయ సెలవులను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తంగా 20 రోజులు హాలిడేస్ ఉంటాయని వీటితోపాటు. మరో 17 రోజులు ఐచ్చిక సెలవులు ఉంటాయని తెలియజేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం.ఇక సాధారణ సెలవులు విషయానికొస్తే జనవరి నుండి ప్రారంభమై డిసెంబర్ వరకు ఏ ఏ నెలలో ఏ ఏ తారీకుల్లో సెలవులు వస్తాయో ఇప్పుడు తెలుసుకున్నట్లయితే.. మొదటగా జనవరి అనగానే మనకు గుర్తు వచ్చేది సంక్రాంతి పండుగే.. ఈ ఫెస్టివల్ కి జనవరి 15 అలాగే 16న కనుమకు.. అలాగే అదే నెలలో 26న రిపబ్లిక్ డే కూడా వస్తుంది. మార్చి 8న మహాశివరాత్రి 25న హోలీ 29 న గుడ్ ఫ్రైడే వంటివి ఉంటాయి.ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రాయ్ జయంతి 9న ఉగాది 11న రంజాన్ 17వ తేదీన శ్రీరామనవమి కలదు..జూన్ 17న బక్రీద్ ..జులై 17న మొహరం.. అలాగే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం తో పాటు 26న శ్రీ కృష్ణాష్టమి సెప్టెంబర్ 7న వినాయక చవితి.. అక్టోబర్ 2 గాంధీ జయంతి.. 11న దుర్గాష్టమి 31న దీపావళి డిసెంబర్ 25న క్రిస్మస్ సెలవులు ప్రకటించింది.
2024 లో రాబోయే సెలవుల తేదీకి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది.