
దీంతో ఏపీలో 9 జిల్లాలకు ఏపీ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది.ఆ జిల్లాలు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం.. నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, కృష్ణ ,ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ తదితర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఏపీలో మరో 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తున్నది.ఇందులో నెల్లూరు, కడప ,తూర్పుగోదావరి, అల్లూరి జిల్లా ,కాకినాడ, జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ను జారీ చేశారు. అలాగే మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.. తిరుపతి, విశాఖపట్నం,అన్నమయ్య , శ్రీకాకుళం,నంద్యాల ,అనకాపల్లి ,మాన్యం విజయనగరం ఎల్లో అలర్ట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో సగటున 16.4 సె. మీ వర్షపాతం సైతం కురిసినట్లు తెలుస్తోంది. మనోబోలు.. సైదాపురం... నెల్లూరు.. వెంకటాచలం... మండలాల్లో భారీ వర్షాలు కురిసినట్లుగా తెలుస్తోంది. ఈ వర్షం నిలిచిపోవడంతో వరదలలో చిక్కుకున్న వారికి సైతం ప్రభుత్వం పలు సహాయ కార్యక్రమాలను సైతం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తుఫాను ప్రభావం వల్ల నీటి పారుదల ఎక్కువగా ఉండడంతో నెల్లూరుతో పాటు ఇతర నగరాలలో కూడా విద్యుత్ ఆగిపోవడం జరిగింది. దీంతో దశలవారీగా విద్యుత్ సరఫరా పునరుద్దించడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ చెన్నై ఇతర ప్రాంతాలలో కూడా తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.