చాలామంది ప్రజలు ఈ మధ్యకాలంలో పలు రకాల వింత జబ్బులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. తాజాగా నిన్నటి రోజున ఒక మహిళ కళ్ళు తెగ దురదగా ఉంటున్నాయని వైద్యులను సంప్రదించిందట. డాక్టర్ ఆ మహిళను పరీక్షించి చూడగా ఒక్కసారిగా డాక్టర్లు షాక్ అయ్యారట. చైనాలో వెలుగు చూసిన ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది . అసలు వివరాల్లోకి వెళితే చైనాలో కున్మింగ్ ప్రాంతానికి చెందిన అమ్మాయి కొంతకాలంగా కళ్ళల్లో దురద ఎక్కువగా పెరగడంతో వైద్యులను సంప్రదించడం జరిగిందట.


ఆమె కళ్ళను వైద్యులు పరీక్షించి చూడగా డాక్టర్లకు దిమ్మతిరిగినంత పనైంది.. కళ్ళలో చిన్న చిన్న వాన పాము వంటి పురుగులు ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు.. వెంటనే వైద్యులు ఆపరేషన్ చేసి ఆ అమ్మాయి కుడి కంట్లో నుంచి 40 పురుగులను, ఎడమ కంట్లో నుంచి కొన్ని పురుగులను బయటికి తీయడం జరిగిందట.. దాదాపు మొత్తం 60 పురుగులు దాకా బయటకు తీసేశారట.. దీంతో వైద్యులే మహిళా పరిస్థితి అర్థం కాక చాలా అయోమయ స్థితిలో పడిపోయారట.


మహిళ పరిస్థితి చాలా అసాధారణమని ఆమెను శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు సైతం తెలియజేశారు. అవి ఫైలోరిడేయీ జాతికి చెందిన రౌండ్ వార్మ్స్ అనే  జాతికి చెందిన వాని తెలియజేశారు.. అయితే ఇవి ఎక్కువగా దోమలు, ఈగలు లాంటి కొన్ని రకాల పురుగుల కారణంగా ఇవి వ్యాపిస్తాయని తెలిపారు. అయితే కుక్కలు లేదా పిల్లుల వల్ల ఆ మహిళ కంట్లోకి ప్రవేశించి ఉంటాయని అభిప్రాయపడింది.. కుక్కను తాకిన వెంటనే కళ్ళు నులుముకోవటం వంటివి అసలు చేయకూడదని ఇలా చేస్తే.. దాని చర్మంపై ఉన్న పురుగులు తన కంట్లోకి చేరి ఉంటాయని వైద్యుల సైతం తెలియజేయడం జరుగుతోంది .ఇదిలా ఉంటే ఆ మహిళ కంట్లో మరిన్ని పురుగులు  ఉండవచ్చని వైద్యులు సైతం భావించడంతో ఆమెను మరోసారి ఆమెను చెకప్ కి రావాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

EYE