
ఇది దాదాపు 3 నెలల వరకు ఈ తీవ్ర దగ్గు వస్తున్నట్లుగా యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలుపుతోంది.. వీరు తెలిపిన ప్రకారం ఈ ఏడాది జూలై - నవంబర్ మధ్య కాలంలోనే దాదాపు ఈ దగ్గుబారిన 716 కు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించడం జరిగిందట. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన బ్యాక్టీరియాగా కనుగొనడం జరిగిందట.
ఈ 100 రోజుల దగ్గు... కోరింత దగ్గు రకానికి చెందినదిగా ఆరోగ్య నిపుణులు గుర్తించారు. నిపుణుల ప్రకారం బ్యాక్టీరియా వల్ల ఊపిరితిత్తుల లో ఇన్ఫెక్షన్ అయ్యి ఎక్కువగా దగ్గు వస్తున్నట్లుగా గుర్తించారు. ఈ వ్యాధిలో జలుబు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట.. అంతేకాకుండా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని ..తీవ్రమైన దగ్గుతో కొన్నిసార్లు వాంతులు చేసుకోవటం పక్కటెముకలు నొప్పితో పాటు గొంతు నొప్పి గొంతులో పుండ్లు వంటివి వస్తున్నాయట. ఈ దగ్గు ఇలాంటి సమస్యలకు దారితీస్తోందని UK నిపుణుల సైతం హెచ్చరిస్తున్నారు... అయితే ఈ దగ్గు చిన్నపిల్లల వృద్ధుల్లో వచ్చే దగ్గుకి టీకా ద్వారా తగ్గించే అవకాశం ఉందని తెలియజేశారు.. ఈ టీకా పేరు కూడా NHS అని తెలియజేయడం జరిగింది. మరి ఈ వైరస్ కేవలం యూకే లోనే కలవరపెడుతోందా మరే ప్రాంతాలలో కూడా వస్తోంది అనే విషయం తెలియాల్సి ఉంది.