ఈ ప్రభావంతో శుక్ర శని వారం దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసాయట .రానున్న 24 గంటలు దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమలో బీభత్సంగా గాలులతో కూడిన వర్షాలు సైతం కురుస్తాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ వారు.. ఉత్తర కోస్తాలు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇవాళ ప్రకాశం ,నెల్లూరు, బాపట్ల, అన్నమయ్య, గుంటూరు, చిత్తూరు, శ్రీ సత్య సాయి తిరుపతి ,కడప జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు పడే అవకాశం ఉందట.
వర్షాల సంగతి ఇలా ఉంటే రాష్ట్రంలో పోడిగాలులతో పాటు పొగ మంచు ప్రభావం ఎక్కువగా రాయలసీమ జిల్లాలలో ఇలాంటి వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉందట.. మరొకవైపు పలు ప్రాంతాలలోని ప్రజలు అరకు ,చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు పొగ మంచు కప్పేస్తోందని రాబోయే రోజుల్లో వాతావరణం మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఉష్ణోగ్రత శాఖ తెలియజేస్తోంది. దీంతో చాలామంది రైతుల సైతం చేతికి వచ్చిన పంటని నష్టపోతున్నామంటూ వాపోతూ ఉండగా మరి కొంతమంది వర్షాలు కరెక్ట్ సమయానికి పడక పంట నష్టంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం తమని ఆదుకోవాలంటు తెలియజేస్తున్నారు. ఇప్పటికే తుఫాను వల్ల చాలా నష్టపోయిన రైతులను కూడా ఆదుకుంటామని తెలియజేయడం జరిగింది.