
ఇక ఇలాంటి రోడ్లపై డ్రైవింగ్ చేయడం చాలా కష్టం అని చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటి కష్టమైన పనిని కూడా ఎంతో సులువుగా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. డ్రైవింగ్ పట్ల ఎంతో నైపుణ్యత ఉన్నవారు. ఎంతో సులభంగానే రిస్కీ స్టంట్స్ చేయగలరు. ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేయగా.. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. దీనిని మాత్రం ఇంట్లో అస్సలు ప్రయత్నించవద్దు అంటూ ఆయన అందరిని కోరాడు.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఇరుకైన ఘాట్ రోడ్ లో రెండు కార్లు ఎదురెదురుగా వస్తున్నట్లు కనిపిస్తున్నాయి సాధారణంగా ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఒకదానికొకటి పక్క నుంచి వెళ్ళిపోతాయి. అయితే ఆ రోడ్డులో కేవలం ఒక్క వాహనం మాత్రమే వెళ్లడానికి వీలుంది. ఇలాంటి సమయంలో ఇక వెనక్కి వెళ్లలేక ముందుకు వెళ్లలేక డ్రైవర్లు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఒకవైపు ఉన్న కారు డ్రైవర్ మాత్రం తన కారుని ఏకంగా అసాధారణ రీతిలో డ్రైవింగ్ చేస్తూ ఇక అక్కడి నుంచి ముందుకు సాగుతాడు. ఏకంగా గోడకు బల్లి పాకినట్లుగా కారును నడుపుతాడు. ఇది చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.