ఈమధ్య చాలామంది తమ ఇళ్లల్లో ఎక్కువగా పలు రకాల జంతువులను పెంచుకుంటూ ఉంటున్నారు.. అందులో పిల్లులు కుక్కలు ఎక్కువగా పెంచుకునే జంతువులు కాబట్టే వీటిని పెంచుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. చాలామంది కుక్కల్ని పెంచుకోవడంలో ఎక్కువ మక్కువ చూపుతున్నారని ఒక నివేదికలో తెలియజేయడం జరిగింది పరిశోధకులు. కానీ అలా పెంచుకోవడం మంచిది కాదు అలాగే కొంతమంది తన పెంపుడు కుక్కలను ఎక్కువగా తమతోపాటు పడుకోబెట్టడం వంటివి చేస్తూ ఉన్నారు ఇలా చేయడం వల్ల చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.



కానీ మనం ఎంత శుభ్రంగా  చూసినప్పటికీ అవి నేల మీద మట్టిలో ఎక్కువగా తిరుగుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి వాటిని ఎంత బాగా చూసుకున్నా పర్వాలేదు కానీ.. వాటిని దగ్గరకి పీల్చుకొని మరి ముద్దులు పెట్టడం వంటివి చేయకూడదట..అలా పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకోవడం వలన వాటికి ఉండే బ్యాక్టీరియా, వైరస్ లు చాలా ప్రమాదానికి గురయ్యేలా చేస్తాయి. ఎక్కువగా ముద్దులు పెట్టడం వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయేలా ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. పెంపుడు జంతువులు నేల పైన ఎక్కువగా దొర్లడం వల్ల వాటి లాలాజలం నేలపై పడిన మనం తెలియక తిరుగుతూ ఉంటాము దీనివల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయట.. పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకోవడం వలన ప్లేగు వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు పరిశోధనలో తెలియజేశారు.




అందుకే ఇలాంటి వాటిని ముద్దు పెట్టుకోపోవడం  చాలా మంచిది.. ఇలా ముద్దు పెట్టుకోవడం వల్ల చిగుళ్ల వ్యాధి రావడంతో పాటు బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంకా వాటితో కలిసి పడుకోవడం వలన అనేక చర్మ సమస్యలు అలర్జీలు వస్తూ ఉంటాయట.అంతేకాకుండా పెంపుడు జంతువులకు ఎక్కువగా బ్యాక్టీరియా సోకుతూ ఉంటుంది. కాబట్టి పెంపుడు జంతువులను మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్న అవి మనకి చాలా అనారోగ్యానికి గురయ్యేలా చేస్తాయి అందుచేతనే వీటికి తగినంత దూరంగా ఉండటమే మంచిదంటూ తెలుపుతున్నారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: