మామూలుగా మసాలా దోశ అంటే బండిమీద అయితే 30 రూపాయలు ఉండొచ్చు.. అదే స్టార్ హోటల్స్ అయితే 100 రూపాయలు ఉండొచ్చు. కానీ అక్కడ దోశ తినాలంటే 600 రూపాయలు అక్షరాల చెల్లించాల్సి ఉంటుంది.. ఏంటి 600 దోశ అంటే ఆశ్చర్యపోతున్నారా..మీరే కాదు ఇది విన్న వారందరూ ఇలాగే నోరెళ్ళ పెడుతున్నారు. ఇంతకీ ఈ దోస ఎక్కడ వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.



అంత కాస్ట్లి దోశ తినాలంటే ముంబై విమానాశ్రయానికి వెళ్లాల్సిందే.. అక్కడే  ఇంత ఖరీదైన దోస దొరుకుతుందట. ఈ దోశ ఇంత కాస్ట్లీ కదా ఇందులో ఏమైనా స్పెషల్ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ  అలాంటిది ఏమీ లేదు.. అయినప్పటికీ సాధారణ  మసాలా దోశ ఇంత రేటా అని జనం నోరెళ్ళ పెడుతున్నారు. షెఫ్ డాన్ ఇండియా అనే ఐడి తో ఇంస్టాగ్రామ్ లో ఈ దోసకి సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు.. ఈ వీడియో  ముంబై ఎయిర్ పోర్ట్ లో దోశ కంటే బంగారమే చాలా చౌకగా దొరుకుతుందంటూ క్యాప్షన్ ని జత చేయడం జరిగింది. వీటిని చూసి పలువురు నేటిజెన్లు పలు రకాలుగా సెటైర్లు వేస్తున్నారు.


మసాలా దోశ గురించి తెలుసుకొని సౌత్ ఇండియన్స్ ఒక్కసారిగా కంగు తిన్నారు. బహుశా ఈ దోశ వేయటానికి గ్యాస్ కాకుండా టర్బైన్ ఫ్యూయల్ తో చేసుంటారా అంటే కామెంట్స్ చేస్తున్నారు.. ఈ దోశ ధర చూస్తుంటే ఏకంగా అక్కడి  వెండి రేటుకు ఈక్వల్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి కొంతమంది  మా ఊర్లో దోస 40 రూపాయలే.. ముంబై ఎయిర్ పోర్టు లో దోష మాత్రం తినలేము అంటూ నేటిజన్స్ కామెంట్స్ ను చేస్తున్నారు. మరికొందరు ఎయిర్ పోర్టు దుకాణం అద్దె ఎక్కువగా ఉంటుందని అందుకు అనుగుణంగానే ధరలు పెట్టి ఉంటారని అభిప్రాయపడ్డారు నేటిజన్స్. ఏదేమైనా ముంబై ఎయిర్ పోర్టు లో దోశ రేటు మాత్రం మొత్తం ప్రపంచమంతా వైరల్ గా మారుతోంది. అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: