మెట్రో సదుపాయాన్ని ఎందుకు తీసుకువచ్చారు అంటే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు.. ఎంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అని సమాధానం చెప్పేవారు మొన్నటివరకు. కానీ ఇప్పుడు మెట్రో ట్రైన్ ఎందుకు ఉంది అంటే ఎంతో మందికి సోషల్ మీడియాలో పాపులారిటీని తెచ్చి పెట్టేందుకు.. ఇక లవర్స్ కు ఎక్కడో పార్కులోకి వెళ్లడం కాదు.. మెట్రోలోనే రొమాన్స్ చేసేందుకు అని సమాధానం చెబుతున్నారు. అయితే ఇలాంటి సమాధానం చెప్పడానికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రోలో వెలుగులోకి వస్తున్న ఘటనలే ఇలాంటి సమాధానాలకు కారణం అని చెప్పాలి.


 ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు సౌకర్యమైన ప్రయాణాన్ని అందిస్తుందో లేదో కానీ ఎన్నో అవాంచిత ఘటనలకు మాత్రం నిలయంగా మారిపోతుంది అని చెప్పాలి. ఎంతోమంది లవర్స్ ఏకంగా మెట్రో ట్రైన్ లో చుట్టూ అందరూ ఉన్నా కూడా పట్టించుకోకుండా రొమాన్స్ లో మునిగి తేలుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకొంతమంది సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం మెట్రో ట్రైన్ లో డాన్సులు చేయడం చిత్త విచిత్రమైన పనులు చేయడం లాంటివి కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయి. ఇలాంటి ప్రయాణికులపై చర్యలు తీసుకోవాలని అటు మిగతా ప్రయాణికులు అందరూ కూడా  మెట్రో యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.


 అయితే ఇటీవలే మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా మెట్రో ట్రైన్ లో ఒక యువతి యువకుడు థంసప్ తాగారు. థంసప్ తాగడంలో తప్పేముంది అంటారా.. అయితే అది తాగిన విధానం మాత్రం జుగుప్సాకారంగా ఉంది అని చెప్పాలి. ఏకంగా కాలికి ధరించే షూస్ లో థంసప్ పోసుకొని అందులో స్ట్రా వేసుకొని యువతి యువకుడు ఇక ఆ కూల్ డ్రింకులు తాగేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా ప్రియుడు తన కాలికి ఉన్న షూ తీయగా అందులో పక్కనే ఉన్న యువతీ థంసప్ పోస్తుంది. ఆ తర్వాత అందులో స్ట్రా వేసుకొని తాగేస్తారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారగా ఇది చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: