తాజాగా సోషల్ మీడియాలో ఒక వెరైటీ డిష్ వీడియో వైరల్ గా మారుతోంది .. అదేమిటంటే మనం మామూలుగా కొత్తిమీర బజ్జి, పకోడీలు చేయడం వంటివి మనం చూస్తూనే ఉన్నాము.. కానీ ఇప్పుడు తాజాగా ఓరియో బిస్కెట్లతో బజ్జీలను చేయటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇది ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.బజ్జీలలో రకరకాల వెరైటీలు ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు బజ్జీల ప్రియులు స్పైసీగా చేసుకునే వంటకం అంతేకాకుండా తక్కువ ధర కావటంతో సాయంత్రం అయితే చాలు ఎక్కువమంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు.
ఈ వైరల్ అవుతున్న ఈ వీడియోలో టిఫిన్ సెంటర్లో వ్యక్తి బజ్జీల పిండిని సిద్ధం చేసుకొని అందులో బిస్కెట్లను ఆ పిండిలో అద్ది నూనెలో బజ్జీలుగా వేశారు.. అంతే వాటిని సగానికి కట్ చేసి వేడివేడిగా సర్వ్ చేస్తే ఉన్నట్లుగా చూపించారు అయితే వీటి రుచి ఎలా ఉందో తెలియదు కానీ.. చాలామంది వీటిని తినడానికి ఇష్టపడుతున్నారు ఈ వింత వంటకానికి సంబంధించిన ఈ వీడియో మాత్రం వైరల్ గా మారుతోంది.. దీంతో క్షణాలలో లైకులు తో ఈ వీడియో ట్రెండీగా మారుతుంది మరి కొంతమంది ఈ ప్రయోగాన్ని చూసి నేటిజన్స్ సైతం ఇదేమి ఆహారం అంటూ కూడా వారి పైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వెరైటీ వంటకాలతో జనాలను పిచ్చెక్కించేలా చేస్తున్నారు.