
అయితే ఇలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే చాలా ఘటనలు ఇక ప్రతి ఒక్కరికి కూడా కొత్త విషయాలను నేర్పిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక రోజు చేసే పనులనే కాస్త కొత్తగా ట్రై చేస్తే మరింత బాగుంటుంది అని ఎంతోమంది చేసి చూపిస్తే ఇక ఇలాంటి వీడియోలను చూసి చాలామంది రియల్ లైఫ్ లో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఇటీవల కాలంలో ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది. ఒకప్పటిలా కట్టెల పొయ్యి ఎవరు పెట్టుకోవట్లేదు. అయితే గ్యాస్ వెలిగించాలంటే లైటర్ ఉండాల్సిందే. ఒకవేళ లైటర్ అందుబాటులో లేకపోతే కనీసం అగ్గిపెట్టె అయినా ఉండాల్సిందే.
ఈ రెండు లేకుండా గ్యాస్ స్టవ్ వెలిగించడం కుదురుతుందా అంటే.. ఎంత ఆలోచించినా కుదరదు అని సమాధానం చెప్పేస్తారు ప్రతి ఒక్కరు. అయితే ఇక్కడ ఒక యువకుడు మాత్రం లైటర్ గాని లేదంటే అగ్గిపెట్టగానీ లేకుండా కేవలం చేతి వేలి ద్వారా గ్యాస్ స్టవ్ ని వెలిగించాడు. అదేంటి అలా ఎలా కుదురుతుంది ఐరన్ మ్యాన్ లాగా అతని ఏమైనా ఫైర్ మానా అంటారా.. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. వంట గదిలో కూర్చిపై కూర్చున్న యువకుడు తన కుడి చేతి వేలిని బర్నర్ పై ఉంచాడు. ఇక మరో వ్యక్తి యువకుడి తలపై టవల్ ను ఉంచి దానిని కొంచెం గట్టిగా లాగాడు. ఇక ఆ వ్యక్తి అలా చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ మండటం ప్రారంభమైంది. ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు.