కరోనా కొత్త వేరియంట్ తో ప్రస్తుతం ప్రపంచ దేశాలకు కునుకు లేకుండా పోతోంది.ఇప్పటికే ఐరోపా దేశాల నుంచి సరికొత్త వేరియంట్ కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.WHO ప్రపంచ దేశాలను సైతం అప్రమత్తంగా ఉండాలంటూ తెలియజేస్తున్నారు. ఒమిక్రాన్ ఉపవేరియంట్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తోందని ఈ వైరస్ వల్ల చాలామంది మానసిక సమస్యలతో కూడా ఇబ్బందులు పడుతున్నట్లు తాజా పరిశోధనలు తేలినట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. కరోనా ఒమిక్రాన్JN-1 వ్యాప్తి చెందడం వల్ల ప్రపంచ దేశాలు సైతం చాలా ఆందోళనకు గురవుతున్నారు.


ఇప్పటికే ఇండియా చైనా యూకే యూఎస్ ఇతర ప్రాంతాలలోని అనేక దేశాలలో కూడా ఈ వేరియంట్ చాలా సైలెంట్ గా వ్యాపిస్తుంది.. 2020లో వచ్చిన కరోనా వైరస్ కంటే చాలా భిన్నంగానే ఉందంటూ నిపుణుల సైతం హెచ్చరిస్తున్నారు.. ఈ కొత్త వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వేగంగానే సోకుతోందని ఇది త్వర త్వరగా సోకే వారి సంఖ్యను పెంచేలా చేస్తోందని WHO సమస్థ తెలియజేసింది. యూకే ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం దాదాపుగా యూకేలో 10 శాతం మంది నవంబర్ నెల నుంచి నిద్రలేమి రాత్రులతో పాటు, ఏదో ఆందోళన చెందుతున్న సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

ముఖ్యంగా వీటిలో కొంతమందికి ముక్కు నుండి నీరు కారడం దగ్గు రుచి వాసన కోల్పోవడం వంటివి లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయట.సుమారుగా 31 శాతం మంది రోగులు ఈ లక్షణాలను కలిగి ఉన్నట్లు పలు నివేదికలు సైతం తెలియజేస్తున్నారు.. ఇందులో 23% మంది ప్రజలు దగ్గుతూ ఇబ్బంది పడుతూ ఉండగా మరో 20% తలనొప్పి తో పాటు మరో 20 శాతం బలహీనత అలసట వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారట.. మరో 16% మంది కండరాల నొప్పులతో పాటు 13 శాతం మంది గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు WHO సమస్త తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: