
కానీ దుబాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా అందరూ మనుషులు కూడా కుక్కలు పిల్లులను తెచ్చుకొని ఇంట్లో పెంపుడు జంతువులుగా పెంచుకుంటూ ఉంటారు. కానీ దుబాయిలో మాత్రం పులులు సింహాలని పెంచుకోవడం చేస్తూ ఉంటారు. ఇలా పెంచుకుంటే దానిని స్టేటస్ గా భావిస్తూ ఉంటారు ఇలా చిరుతలను పులులను సింహాలను ఇళ్లల్లోకి తెచ్చుకొని ఏకంగా పెంపుడు కుక్కల్లాగానే పెంచుకుంటూ ఉంటారు. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంటాయ్ అన్న విషయం తెలిసిందే.
అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఇలాగే ఒక పెద్ద పులిని పెంచుకున్నాడు. ఇక దానితో సరదాగా ఆటలు కూడా ఆడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఇల్లంత పరిగెడుతూ ఉండగా ఆ పెద్దపులి అతడిని పట్టుకునేందుకు అతని వెంట పరుగులు తీస్తుంది. పరుగెత్తే క్రమంలో అదుపుతప్పి కింద పడిపోయాడు అయినా సరే పులి అతడిని వదలలేదు వెంబడించి మరీ అతని పట్టుకుంది. అయితే పెంపుడు పులి కావడంతో అతనికి ఎలాంటి హాని చేయలేదు ఆ పులి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా పెద్దపులి వెంటాడిన తీరు చూసి మాత్రం నేటిజన్స్ వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి.