ఇంకొన్నిసార్లు జరిగే రోడ్డు ప్రమాదాలలో ఒకరు చేసిన పొర పాటుకు ఇంకొకరు బలయ్యే పరిస్థితులకు కారణం అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలం లో సోషల్ మీడియా కారణం గా ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన కూడా అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారిపోతున్నాయి. ఇక కొన్ని కొన్ని సార్లు ఇలా వైరల్ గా మారిపోయే రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చూసి ఎంతో మంది వాహనదారుల తీరులో మార్పు వస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే అతివేగం అనర్ధం అని చెబుతూ ఉంటారు అధికారులు. పెద్దలు కూడా ఎప్పుడు ఇదే హెచ్చరిస్తూ ఉంటారు.
కానీ బండి కొన్నది ఎందుకు వేగంగా నడపడానికి కాదా అన్నట్లుగా కొంతమంది వాహనదారులు అతివేగంగా వెళుతూ చివరికి రెండు ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. ఓ మహిళా తనతో పాటు మరో మహిళను స్కూటీపై వెనక ఎక్కించుకొని వెళ్తుంది. అయితే ఒక మూలమలుపు దగ్గర ఎంతో వేగంగా వెళ్ళింది ఆమె. ఇక వాహనం కంట్రోల్ కాలేదు. దీంతో ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టింది ఈ క్రమంలోనే స్కూటీ వెనకాల సీట్ లో కూర్చున్న మహిళ ఎగిరి గోడ అవతలికి పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోని సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.